21-11-2020 శనివారం దినఫలాలు - ఒంటెద్దు పోకడ మంచిదికాదు... (video)

శనివారం, 21 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు వాయిదాపడతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం : మత్స్యు, కోళ్ళ, చిన్నతరహా పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన రుణాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. తోటివారి తీరు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : సొంత వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పనివారితో సమస్యలను ఎదుర్కొంటారు. బంధువుల వల్ల సమస్యలు చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. 
 
కర్కాటకం : ఒంటెద్దు పోకడ మంచిదికాదని గమనించండి. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం క్షేమదాయకం. ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. విద్యుత్ రంగాలలో వారికి మాటపడక తప్పదు. 
 
సింహం : ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి చికాకులు తప్పవు. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరగలవు. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు అతికష్టంమ్మీద చేజిక్కించుకుంటారు. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శనకు సన్నాహాలు చేస్తారు. 
 
కన్య : బంధువుల ఆకస్మిక రాక అశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి చిన్న పని మీరే చేసుకోవలసి వస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత, ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు, గృహ మార్పులు, నిర్మాణాలకు అనుకూలం. శుభకార్యయత్నం ఫలించడంతో కళ్యాణ మండపాలు కోసం అన్వేషిస్తారు. 
 
తుల : సహోద్యోగులతో సమావేశాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. వివాదాస్పద విషయాల్లో వాస్తవాలు బయటపడతాయి. మీ కొచ్చిన కష్టానికి సానుభూతి చూపేవారే కానీ సహాయం చేసేవారుండరు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఉత్తమం. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించునపుడు ఆత్మనిగ్రహం వహించండి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. గృహానికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా మంచిది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. పుణ్యక్షేత్రా దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
మకరం : ఆర్థిక విషయాలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. 
 
కుంభం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతగా పూర్తిచేస్తారు. మీ కోపతాపాలు తగ్గించుకోవడం క్షేమదాయకం. వనసమారాధనల్లో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మీనం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు