23-08-2021 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినా...

సోమవారం, 23 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి తలెత్తుతాయి. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్మలను మోసగిస్తారు. 
 
వృషభం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. వివాహ యత్నాల్లో సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
మిథునం : మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి కావడం కష్టం. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. విద్యార్థులకు మిత్ర బృందాలు వ్యాపకాలు అధికం కాగలవు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లువిరుస్తాయి. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి.  
 
సింహం : వృత్తి వ్యాపారాల్లో సానుకూలత ఉంటాయి. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువులు పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
కన్య : బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. 
 
తుల : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రుణ విముక్తులు కావడంతో తాకట్లు విడిపించుకుంటారు. మీ సంతానం విద్యా వివాహాలకు ఖర్చులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యలు నుంచి బయటపడతారు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. 
 
ధనస్సు : బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల చికాకులు, అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది మీరు చేయు వృత్తి వ్యాపారాలు యందు ప్రోత్సాహం, వాక్ చాతుర్యం ఉండును. విదేశీ యత్నాల్లో స్వల్ల ఆటంకాలు ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మకరం : ఆర్థికంగా పురోగమించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఓర్పు, దీక్షతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. స్త్రీలు పనివారితో ఇబ్బందులకు గురవుతారు. 
 
మీనం : సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు