24-02-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. మల్లికార్జున స్వామిని?

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (05:00 IST)
మేషం: ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. దూర ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం: చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఓర్పు, సంయమనం అవసరం. స్థిరాస్తుల అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. మీ సంతానం కోసం ఫీజులు చెల్లిస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కొంతమంది మీతో సన్నిహితంగా వుంటూనే చాటుగా అపకారం తలపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అకాలభోజనం వల్ల స్త్రీలకు ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం క్షేమదాయకం. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఓర్పు, సహనం, శాంతి కలిగి ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు.
 
సింహం: ధనం అంటే మీ ఆత్మగౌరవానికే విలువనిస్తారు. కుటుంబ సఖ్యత అంతగా వుండక పోవచ్చు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. చర్చల్లో కొన్ని లోపాలు తలెత్తుట వలన రాజకీయాల్లో వారికి ఆందోళన అధికమవుతుంది. హోటల్, తిను బండారు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 
 
కన్య: స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టకపోవడం మంచిది. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. 
 
తుల: వ్యాపారంలో పెరిగిన పోటీని తట్టుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. పనులు మొదట్లో మందగించినా క్రమేపీ పూర్తి కాగలవు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 
 
వృశ్చికం: సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికం కాగలవు. స్త్రీలకు విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబ సఖ్యత అంతగా వుండకపోవచ్చు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిలువ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మకరం: ప్రైవేట్, పత్రికా సంస్థల్లోని వారికి యాజమాన్యంతో అవగాహన లోపిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. పాత మిత్రుల కలయిక గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
కుంభం: అందరికీ సహాయం చేసి నిందారోపణ ఎదుర్కోనవలసి వస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పవు. 
 
మీనం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. మీ భావాలకు, రచనా పటిమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారం నందు రావలసిన బాకీలు అందుకుంటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో అలసట, చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు