సోమవారం (24-05-2021) రాశిఫలితాలు - నవగ్రహ ధ్యానం చేసినా...

సోమవారం, 24 మే 2021 (04:00 IST)
మేషం : స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువులు మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి శుభవార్తలు అందుతాయి. 
 
వృషభం : బ్యాంకు పనులు చికాకు కలిగిస్తాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. బిల్లులు చెల్లిస్తారు. మీ అభిప్రాయాలను, ఆలోచనలు బయటకు వ్యక్తం చేయకండి. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. 
 
సింహం : వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. 
 
కన్య : మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి విభేదాలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట మంచిది. 
 
తుల : వృత్తి, వ్యాపారాలలో అంచాలు నిజమవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు ముందుగానే ఊహించనవి కావడంతో ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. పత్రికా సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
వృశ్చికం : మీ సంతానం ఉన్నత విద్య గురించి మంచి మంచి ఆలోచనలు పథకాలు వేస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణం తీర్చడానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు : మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీ ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. లీజు, ఏజెన్సీలు, టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
మకరం : దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. వ్యాపారస్తులకు అధిక శ్రమానంతరం లాభాలను పొందుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ చాలా అవసరం. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. 
 
కుంభం : రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళకువ అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు సభా, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ, ఏకాగ్రత వహించండి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగదా పూర్తిచేస్తారు. శ్రీమతి లేక శ్రీవారు ఆలోచనలు పరస్పర విరుద్దంగా ఉంటాయి. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు