26-04-2021 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధించినా... (video)

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (04:04 IST)
మేషం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికులతో చికాకులు, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. మీ అభిరురుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులకు మసలుకుంటారు. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
మిథునం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. లీజు, ఏజెన్సీలు, టెండర్లకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. హోటల్ కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు. 
 
సింహం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. వాణిజ్య వాపార రంగాలవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : వ్యాపారాల విస్తరణలు, సంస్థల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులు, కుటంబీకులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికం. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహన ఏర్పడుతుంది. 
 
తుల : భాగస్వామిక చర్చలు సామాన్యంగా పూర్తికావు. స్త్రీలకు చీటికి మాటికి అసహనం. నిరుత్సాహం వంటి చికాకులు తప్పవు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాలవారికి పనిభారం. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. జాగ్రత్త వహించండి. 
 
ధనస్సు : ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఇతరులను మీ విషయాలను దూరంగా ఉంచడం మంచిది. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాట పడవలసివస్తుంది. 
 
మకరం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి మిశ్రమ ఫలితం. గృహంలో మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం. ఒక వార్త మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కుంభం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం :  వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానిక్ రంగాలవారికి అనుకూలం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు