30-05-22 సోమవారం రాశిఫలాలు ... ఈశ్వరుడిని పూజించి శుభం, జయం...

సోమవారం, 30 మే 2022 (04:00 IST)
మేషం :- ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, నిరుత్సాహం తప్పదు. మార్కెటింగ్ రంగాల వారికి, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి.
 
వృషభం :- ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికం అవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు, పంతాలకు పోవటం వల్ల ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు తమ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిన పురోభివృద్ధి కానరాగలదు.
 
మిథునం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ అవసరం. ద్విచక్ర వాహనంపై నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విజయాలు తేలికగా సొంతమవుతాయి.
 
కర్కాటకం :- పోస్టల్, టెలిగ్రాఫ్, ఎల్.ఐ.సి., రంగాల వారికి కలిసివచ్చును. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని విషయాలందు ధనరాబడిని అన్వేషించి నడచుకొంటారు. సన్నిహితుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
సింహం :- ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. స్థిరాస్తిని అమర్చుకుంటారు. మీ పై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటివి కలుగే అవకాశం ఉంది. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయటం మంచిది. హోటలు, తినుబండ, కేటరింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. స్త్రీలకు తల,కళ్ళు, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోద తప్పదు. ఖర్చులు అధికమైనా ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడంవల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
తుల :- మీ ఆశయ సాధనకు ఉన్నత స్థాయి వ్యక్తులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియచేయటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
వృశ్చికం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ పథకాలు కార్యరూపం దాల్చుతాయి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ తొందరపాటుతనం ఇబ్బందులను దారి తీస్తుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహిస్తారు.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం కావటంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు.
 
మకరం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఆదాయం బాగున్నా ఆర్థికస్థితి ఏమంత సంతృప్తికరంగా ఉండదు. ఆస్తి వ్యవహారాల విషయంలో కుటుంబీకుల నిర్ణయం నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడతారు.
 
కుంభం :- విద్యార్థినులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పెద్దల ఆర్యోగంలో మెళుకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పెంపుడు జంతువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పెరుగుతుంది. భాగస్వామికుల మధ్య అవగాహన లోపిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు