03-05-22 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల...

మంగళవారం, 3 మే 2022 (04:00 IST)
మేషం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, సేవాకార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది.
 
వృషభం :- బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనిభారం అధికం అవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. రిప్రజెంటివులకు, ప్రైవేటు సంస్థలలోని వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా సమసిపోతాయి.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. వాహనం ఏకాగ్రతతో నడపాలి. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. ప్రియతముల కోసంధనం బాగుగా వెచ్చిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. ఏ పని తల పెట్టినా మొదటికే వస్తుంది.
 
సింహం :- గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు. ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షలలో విజయం సాధిస్తారు.
 
కన్య :- ఉమ్మడి వ్యాపారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ధ్యాస వహిస్తారు. దూర ప్రయాణాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఏ విషయంలోను ఒంటెత్తుపోకడ మంచిదికాదు.
 
తుల :- బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు. కిరణా, ఫాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటు చేసుకుంటాయి.
 
వృశ్చికం :- మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు అధికం. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
మకరం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో సరిచూసుకోండి. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కుంభం :- చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం రాజకీయ నాయకులకు సభా, సమావేశాలలో నూతన పరిచయాలేర్పడతాయి. తలపెట్టిన పనుల్లో జయం చేకూరుతుంది. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టండి.
 
మీనం :- అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. షాపు గుమస్తాలతో చికాకులు, వినియోగదారులతో మాటపడవలసి వస్తుంది. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల అస్వస్థతకు గురవుతారు. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు