ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు... కారణం ఏమిటి?

వెంకటరెడ్డి-
మీరు త్రయోదశి శుక్రవారం రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువలన శనికి మీ పేరుతో నెలకు ఒక శనివారం నాడు తైలాభిషేకం చేయిస్తే ఆరోగ్యాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి చేకూరుతుంది.

మా ప్రియమైన వీక్షకులకు మనవి:
చాలామంది తమ పుట్టినరోజు, పుట్టిన సమయం, జన్మ నక్షత్రం తెలుపకుండా కేవలం సమస్యలను మాత్రమే రాసి పంపిస్తున్నారు. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం తెలియజేయడం కష్టతరమవుతుంది.

కనుక దయచేసి కనీసం మీ పుట్టినరోజు, పుట్టిన సమయం తప్పక పొందుపరచండి. అదేవిధంగా ఒకే పేరుతో చాలామంది వీక్షకుల వద్ద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారు వేరు వేరు ప్రదేశాలనుంచి పంపుతున్నప్పటికీ ఒకే పేరువల్ల ప్రచురణలో మీకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కనుక పుట్టిన తేదీ, పుట్టిన సమయం, జన్మ నక్షత్రంతోపాటు మీ ఊరు పేరును కూడా జోడించగలరు.

వెబ్దునియా పై చదవండి