పి.పవన్-నెల్లూరు: మీరు నవమి శనవారం, మీన లగ్నము, ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల అప్పుడప్పుడు జ్ఞాపకశక్తి కొంత లోపించడం, చంచలత్వం అధికంగా ఉండటం, చికాకులు వంటివి ఉండగలవు. ప్రతిరోజూ సూర్యభగవానుని పూజించడం వల్ల స్థిరబుద్ధి, అభివృద్ధి చేకూరుతుంది. 2009 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2027 వరకు యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. 2016 నందు మీరు బాగుగా స్థిరపడతారు. 2017 నుంచి మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఏదైనా శివాలయంలో జువ్వి చెట్టును నాటిన మీ సంకస్పం సిద్ధిస్తుంది.