లావణ్య-హైదరాబాద్: మీరు ఏకాదశి బుధవారం, తులా లగ్నము, చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడి ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల పాతఃకాల సర్పదోషం ఏర్పడటం వల్ల మీకు సంతానం కలిగే అవకాశం తక్కువైంది. 2018 లోపు మీకు సంతానం కలిగే అవకాశం 40% మాత్రమే ఉంది. వైద్యుని సలహా పొందినా లేక దత్తతు తీసుకున్నా మీకు శుభం కలుగుతుంది. పుత్ర గణపతిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.