వి.రవీంద్రనాథ్-నిడదవోలు: మీరు సప్తమి శనివారం, వృశ్చిక లగ్నము, రోహిణి నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉండటం వల్ల మీకు మంచిమంచి అవకాశాలు చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి. అందువల్ల మీరు ఆందోళనకు గురవుతున్నారు. 2000 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2018 వరకూ యోగాన్ని ఇస్తాడు. 2016 లేక 2017 నందు మీరు బాగుగా స్థిరపడతారు.