సందీప్.ఎస్.వి- శ్రీనివాసపూర్: మీరు త్రయోదశి బుధవారం, కన్యాలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశఇ నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య బంధించబడిఉండటం వల్ల తక్షక కాలసర్పదోషం ఏర్పడింది. ఈ దోషానికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది. ప్రతిరోజూ దుర్గా స్తుతి చేయండి లేక వినండి. 2017 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మీకు యోగాన్ని స్థిరత్వాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. దేవాలయాలలో మామిడి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.