ఆర్.పాపారావు-శంఖవరం: మీరు దశమి గురువారం, కర్కాటక లగ్నం, కృత్తిక నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. 2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం, 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించి, అర్చించినట్లయితే మీకు శుభం కలుగుతుంది. 2016 లేక 2017 నందు మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి.
2011 నవంబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2029 వరకూ స్థిరత్వాన్ని, అభివృద్ధిని, పురోభివృద్ధిని ఇస్తాడు. 2017 లేక 2018 నందు మీకు వివాహం అవుతుంది. వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవాలయాలలో అత్తి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.