శ్రీనివాస రావు.ఎ-విశాఖపట్నం: మీరు చవితి సోమవారం, కన్యా లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. 2011 నవంబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు మీకు 50 శాతం యోగాన్ని ఇస్తాడు.