గణేష్.ఎస్- పోతవరం: మీరు చతుర్థశి ఆదివారం, మీన లగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. భార్య స్థానాధిపతి అయిన బుధుడు భాగ్య స్థానము నందు ఉండటం వల్ల మీకు వివాహానంతరం మంచి భవిష్యత్తు ఉంది. లగ్నము నందు రాహువు ఉండి సప్తమ స్థానము నందు కేతువు ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల నెలకు ఒక బుధవారం నాడు ఆవు పాలతో సంకల్పసిద్ధి గణపతికి అభిషేకం చేయించినా శుభం కలుగుతుంది.
2017 నందు బాగుగా స్థిరపడతారు. 2017 నందు వివాహం అవుతుంది. 2005 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2023 వరకూ యోగాన్ని, తుదపరి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతిరోజూ సూర్య భగవానుని ఆరాధించిన మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి.