ఎ.సంపత్-రేపల్లె: మీరు సప్తమి ఆదివారం, కర్కాటక లగ్నము, చిత్తా నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 వరకు శని దోషం అధికంగా ఉన్నందువల్ల ధనం ఎంత వచ్చినా నిలబెట్టలేకపోవడం, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు కనకధారా స్తోత్రం చదవడం లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.
సోమవారం నాడు 250 గ్రాములు కందులు, 250 గ్రాములు బియ్యం, 250 గ్రాములు మినుములు నానబెట్టి మంగళవారం ఉదయం ఆవుకు అరిటాకులో ఇవన్ని కలిపి పెట్టండి. దోషాలు తొలగిపోతాయి. 2009 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2025 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది.