రమాదేవి- ఎమ్ గోదావరి ఖని: మీరు చవితి ఆదివారం, వృశ్చికలగ్నము, పునర్వసు నక్షత్రం, మిథున రాశి నందు జన్మించారు. 2017 లేక 2018 నందు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. భర్తస్థానము నందు బృహస్పతి ఉండటంవల్ల వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2016 ఆగస్టు నుంచి 2017 మే నెల లోపు మీకు వివాహం అవుతుంది.
ప్రతిరోజు శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలను ఇస్తుంది. ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడు. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ దేవగన్నేరు చెట్టును నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.