జ్యోతిరెడ్డి - వరంగల్: మీరు చతుర్థశి ఆదివారం, వృశ్చిక లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు ఇంద్రుడు, వరుణుడు ఉండటంవల్ల కుటుంబంలో అశాంతి, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. సదాశివుని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2015 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2018 నుంచి 2035 వరకు ఆర్థికాభివృద్ధిని, కుటుంబసౌఖ్యని, పురోభివృద్ధిని ఇస్తాడు. ఉద్యానవనాల్లో కానీ వేప చెట్టును నాటిన మీకు శుభం, జయం చేకూరుతుంది.