ఎమ్. కిరణ్ కుమార్- రామచంద్రాపురం: మీరు పాడ్యమి మంగళవారం, వృషభలగ్నము, చిత్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు ఇంద్రుడు, వరుణుడు ఉండటం వల్ల 2017 నందు మీకు పునర్వివాహం అవుతుంది. వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2017 జనవరి నుంచి అర్ధాష్టమ శనిదోషం ప్రారంభమవుతున్నందువల్ల జాగ్రత్త వహించండి.
2005 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2018 నుంచి 2021 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. ప్రతీ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. 2019 నుంచి వ్యాపారాల్లో మీరు బాగుగా రాణిస్తారు. అప్పటివరకు మీరు ఉద్యోగం చేయండి. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ తాటి చెట్టు నాటిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.