ఎమ్. హేమంత్ కుమార్- మహబూబ్ నగర్: మీరు త్రయోదశి గురువారం, వృశ్చికలగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. ప్రతీ రోజూ లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. మీకు తూర్పు, ఉత్తర ముఖాలు గల గృహం కలిసివస్తుంది. ఎక్కువ ముదురు రంగు దుస్తులు వాడండి. 2007 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 ఆగష్టు నుంచి 2027 వరకు ఆర్థికాభివృద్ధిని పురోభివృద్ధిని ఇస్తాడు. ఏదైనా దేవాలయాల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.