23 సంవత్సరములు మీకు మంచి భవిష్యత్తు ఉంది(పి. భార్గవ్-చిలకలూరి పేట)

శనివారం, 28 మే 2016 (14:21 IST)
పి. భార్గవ్-చిలకలూరి పేట: మీరు సప్తమి శుక్రవారం, మీన లగ్నము, మూలా నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగ స్థానము నందు చంద్ర, రాహువులు ఉండటం వల్ల 2017 నందు మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు మీ తలుపు తడతాయి. 
 
2017 సెప్టెంబరు నుంచి రవి మహర్దశ 6 సంవత్సరములు, చంద్రుడు 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు మొత్తం 23 సంవత్సరములు మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఉన్నత స్థితిలో స్థిరపడతారు. భార్య స్థానము నందు రవి, బుధులు ఉండటం వల్ల వివాహానంతరం మీకు బాగుగా కలిసిరాగలదు. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, సంకల్పసిద్ధికి శ్రీమన్నారాయణుడిని ఆరాధించండి. ఏదైనా ఉద్యానవనాల్లో వేగి చెట్టును నాటిన దోషాలు తొలగి శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

వెబ్దునియా పై చదవండి