అష్టమ శనిదోషం 2017 జనవరి వరకే...(దివ్య-దేవరకొండ)

సోమవారం, 25 జులై 2016 (20:36 IST)
దివ్య-దేవరకొండ: మీరు చవితి, మంగళవారం, మిథున లగ్నం, అశ్వని నక్షత్రం, మేష రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, చికాకులు, అశాంతి వంటివి ఎదుర్కొంటున్నారు. 2017 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మంచిమంచి సంస్థల్లో స్థిరపడతారు. ప్రతిరోజూ కార్తికేయుని ఆరాధించిన మీ కోరికలు నెరవేరగలవు. దేవాలయాల్లో జీడిమామిడి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది. 2018 నుండి చంద్రమహర్దశ 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

వెబ్దునియా పై చదవండి