2019 లోపు సంతానం కలిగే అవకాశం ఉన్నది(టి.జనార్థన రావు- గుంటూరు)

సోమవారం, 25 జులై 2016 (21:50 IST)
టి.జనార్థన రావు- గుంటూరు: మీరు అష్టమి, గురువారం, సింహ లగ్నం, భరణి నక్షత్రం, మేష రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. సంతాన స్థానము నందు కేతు బంధన దోషం ఏర్పడటం వల్ల నాగప్రతిష్ఠ చేసిన సత్ఫలితాలు ఉంటాయి. 2019 లోపు సంతానం కలిగే అవకాశం ఉన్నది. ప్రతిరోజూ పుత్రగణపతిని ఆరాధించండి. దేవాలయాల్లో గానీ, ఉద్యాన వనాల్లో గానీ దేవదారు చెట్టును నాటిని శుభం కలుగుతుంది. 
 
మీ భార్య సప్తమి, మంగళవారం, పుబ్బ నక్షత్రం, సింహ రాశి నందు జన్మించారు. 2017తో అర్థాష్టమ శనిదోషం తొలగిపోతుంది. 2017 లేక 2018 నందు సంతానం కలిగే అవకాశం ఉన్నది. వైద్యుని సలహా కూడా పొందండి. ప్రతిరోజూ సంతాన వేణుగోపాలుని ఆరాధించిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఉద్యాన వనాల్లో మోదుగ చెట్టును నాటిన మీకు కలిసి రాగలదు. 
 
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

వెబ్దునియా పై చదవండి