31-10-2021 నుంచి 06-11-2021 వరకు మీ వార రాశిఫలాలు

ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:31 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తులతో గడిపేందుకు యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో వ్యవహరిచండి. ఈ చికాకులు తాత్కాలికమే. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పిల్లల అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
వ్యవహారాలతో తలమునకలవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొంతమంది మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో మెలగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. సన్నిహితుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. బుధ, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. సంస్థల స్థాపనకు తరుణం కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాస్తారు. శుక్రవారం నాడు పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
మీదైన రంగంలో విజయం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆయినవారు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆది, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. దంపతుల మధ్య అరమరికలు తగవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. భాగస్వామిక వ్యాపారాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వేడుకకు హాజరవుతారు. 
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. మాట నిలబెట్టుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంగళ, గురు వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అయిన వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సోమ, బుధ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. షేర్ల క్రయ విక్రయాలకు తరుణం కాదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
అచితూచి వ్యవహరించాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గురువారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. శుక్ర, శని వారాల్లో బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. భవన నిర్మాణ కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆర్భాటాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. బంధువుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకు సన్నాహాలు సాగిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పిల్లల అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సమస్యలు సద్దుమణుగుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తుల రాకతో గృహం కళకళలాడుతుంది. పనులు వేగవంతమవుతాయి. పత్రాలు అందుకుంటారు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల దూకుడు అదుపుచేయండి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వారం ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే సూచనలున్నాయి. అపరిచితులతో జాగ్రత్త వాగ్వాదాలకు దిగవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయం అందుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సౌమ్యంగా మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు