కుంభ రాశి 2021: ఏ కార్యం తలపెట్టినా అవాంతరాలే, కానీ...

గురువారం, 10 డిశెంబరు 2020 (21:59 IST)
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 6 అవమానం: 1
ఈ రాశివారికి శని, గురుల సంచారం అధికంగా వుంది. ఏ కార్యం మొదలెట్టినా అవాంతరెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించి విజయం సాధిస్తారు. మాటతీరు అదుపులో వుంచుకోవాలి. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపునకు అవకాశం లేదు. ఆపన్నులకు సాయం అందించి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
 
ఒక సంబంధం కలిసిచ్చే అవకాసం వుంది. గృహ వాస్తు దోష నివారణ చర్యలు ఫలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. వ్యవహారాల నిమిత్తం తరచూ ప్రయాణాలు చేస్తారు. సంతానం వైఖరి వల్ల మనశ్సాంతి అంతగా వుండదు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
ఉపాధ్యాయులకు స్థానచలనం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాలు ఆలస్యంగా అందుతాయి. వ్యవసాయ రంగాల వారికి దిగుబడులు సంతృప్తినిస్తాయి. మద్దతు ధర విషయంలో కొంత నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. క్రీడ, కళాత్మక పోటీల్లో విజయాలు సాధిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు