మధుమేహాన్ని నియంత్రించే అలోవెరా!

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (18:23 IST)
మధుమేహాన్ని నియంత్రించడంలో అలోవెరా దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ పుష్కలంగా ఉండే అలోవెరా రక్తకణాలు, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను డామేజ్ కాకుండా నియంత్రిస్తుంది. 
 
మన శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను, విషపదార్థాలను వెలుపలికి నెట్టి వేసే సహజ గుణం (అలోవెరా)లో ఉన్నాయి. 
 
యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది. మధుమేహ రోగుల ఆహార నియంత్రణ వలన ఏర్పడు పాదాలలో తిమ్మిర్లు మొదలైన సమస్యలను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి