వేసవి తాపానికి దివ్యౌషధం కలబంద...!

శుక్రవారం, 27 మార్చి 2015 (16:58 IST)
అసలే వేసవి కాలం. వేడిమి కారణంగా శరీర ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఒక్కో సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతే.. శీతలపానీయాల జోలికి వెళ్ళకుండా కలబందను తీసుకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు.

వేసవిలో హైడ్రీయేషన్, నెలసరి సమస్యలు, అలెర్జీ, వేడిమికి కలబంద చెక్ పెడుతుంది. కలబందలోని జెల్‌లా ఉండే పదార్థాన్ని వెలికి తీసి శుభ్రమైన నీటిలో కడిగి.. దానికి సమంగా పామ్ షుగర్ కలుపుకుని రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
ఇలా చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత, దురద, కంటిమంట వంటివి తగ్గుతాయి. కంటి మంట తగ్గాలంటే కలబందను సగంగా కట్ చేసి జెల్ ఉన్న ముక్కను కంటిరెప్పలపై 10 నిమిషాల పాటు ఉంచడం ద్వారా కంటి మంట తగ్గిపోతుంది. కలబంద తొక్కను తీసేసి అందులోని గుజ్జులాంటి పదార్థాన్ని శుభ్రమైన నీటిలో కడిగేయాలి. అరకేజీ కలబంద గుజ్జు, తెల్ల ఉల్లిపాయలు పావు కేజీ, నూనె చేర్చుకోవాలి. ఉల్లిని దంచి రసం తీసుకోవాలి.

ఈ రసాన్ని కలబంద గుజ్జుతో కలిపి కాసేపు వేడి చేయాలి. కలబంద గుజ్జు, ఉల్లిరసం బాగా మరిగాక దించేయాలి. ఈ కషాయాన్ని ఆరనించి ఓ బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. ఈ కషాయం ఒక స్పూన్ ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపులో మంట, కడుపునొప్పి, అజీర్తి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి