మెంతికూర కాడలను మిక్సీ పట్టి.. మజ్జిగలో కలిపి తాగితే? (video)

గురువారం, 20 జూన్ 2019 (15:42 IST)
మెంతికూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవండి. మెంతికూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. దీనిద్వారా శరీరంలోని రక్తహీనతను ఇది దూరం చేస్తుంది. ఇంకా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
మెంతికూరను సన్నగా తరిగి.. రెండు గ్లాసుల నీటిలో మరిగించాలి. ఆ నీరు గ్లాసుడు మోతాదు అయ్యేలా మరిగించాక.. ఉదయం సాయంత్రం పూట అరగ్లాసుడు మేర తీసుకుంటే గుండెపోటు పూర్తిగా తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా వుండేవారు మెంతికూర తీసుకోవచ్చు.

మెంతికూరను తీసుకోవడం ద్వారా వేడిమి ద్వారా వచ్చే అలెర్జీలు దూరమవుతాయి. శరీరానికి చలువ నిస్తుంది. కఫం, పిత్త, వాత సంబంధిత రోగాలను దరిచేరనివ్వదు. 
 
పదిగ్రాముల మెంతుల్ని నూనెలో వేయించి.. కాసింత సోంపు, ఉప్పు చేర్చి పౌడర్ చేసుకుని.. మజ్జిగలో కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో మెంతికూరను చేర్చుకోవడం ద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. కంటిచూపుకు మెంతికూర ఎంతో మేలు చేస్తుంది. కంటి దృష్టి లోపాలు వున్నవారు మెంతి కూర తీసుకుంటే.. కంటి చూపు మెరుగుపడుతుంది. 
 
అంతేకాకుండా నరాల బలహీనత మెంతికూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. నరాల సంబందిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో సఫోన్, మ్యూకలేజ్ వంటి ధాతువులు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. మెంతికూరలో విటమిన్ ఎ వుండటంతో గుండెపోటు, దృష్టి లోపాలు, అలెర్జీలు, రక్తహీనత తొలగిపోతాయి. 
 
మెంతికూర కాడలను మిక్సీ పట్టి.. మజ్జిగలో కలిపి తాగడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు. ఇంకా హైబీపీని  నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు