అశ్వగంధంతో చాలామంది టీ కూడా తయారుచేసుకుంటూ ఉంటారు. అశ్వగంధంతో తయారుచేసిన టీ తాగడం వల్ల మెదడులో నాడీసంబంధిత ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కంటిశుక్లాల ద్వారా కలిగే సమస్యలను కూడా అశ్వగంధం తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో రక్తాన్ని శుద్ది చేయడంలో కూడా అశ్వగంధం ప్రధాన పాత్ర పోషిస్తుంది
నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో రారాజు అయిన అశ్వగంధ మూలికలను చూర్ణం చేసుకొని తాగడం వల్ల శరీరం ఉల్లాసంగా వుంటుంది.ఇంకా వైరస్ సంబంధిత రోగాలు దరిచేరవు