నిజానికి బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి కూడా. అయితే, ఇటీవలి కాలంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. ఈ జ్వరపీడితుల్లో పలువురు మృత్యువాతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డెంగీ జ్వరాన్ని బొప్పాయి ఆకుల రసంతో నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
బొప్పాయి ఆకుల నుంచి తీసిన రసం తాగేవారిలో రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా డెంగీ జ్వరం వచ్చిన వారికి బొప్పాయి ఆకుల రసం తాగిస్తే.. ప్లేట్‌లెట్స్ పెరగడమే కాదు, రక్తం వృద్ధి చెందుతుంది. త్వరగా జ్వరం నుంచి కోరుకుంటారని వారు అంటున్నారు.
అయితే కేవలం డెంగీ జ్వరానికి, ప్లేట్‌లెట్స్ వృద్ధికే కాదు, బొప్పాయి ఆకుల రసం మరెన్నో అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. కామెర్లు, కాలేయ వ్యాధులు వచ్చిన వారు నిత్యం బొప్పాయి పండు ఆకుల రసం తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. రుతు సమయంలో మహిళలకు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి.