వెన్న తింటే కొవ్వు పెరుగుతుందని చాలా మంది దాని జోలికే వెళ్లరు. దీని వలన గుండె జబ్బులు వస్తాయని, స్థూలకాయం పెరిగిపోతుందని చాలా మంది అపోహపడుతుంటారు.
కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు, పైగా గుండె ఆరోగ్యానికి వెన్న ఎంతో మంచిదని చెబుతున్నారు. వెన్నలోని విటమిన్ ఎ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. అంతేకాదు ఆహారంతోపాటు వెన్న తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది. దీనిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకు ఇస్తే మంచిదే.
చిన్న పిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న తినిపిస్తే, మెదడు, నాడీ వ్యవస్థల ఎదుగుదల చక్కగా ఉంటుంది. చిన్నతనం నుండి వారికి వెన్న తినడం అలవాటు చేయాలి. పెద్దవారు మాత్రం రోజుకొక స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగాలు రాకుండా ఉంటాయి.