కొబ్బరిలో కొలెస్ట్రాల్ పదార్థాలుండవు. అధిక మోతాదులో కెలోరీలు, ప్రోటీన్లు, మంచి కొవ్వూ, పీచు పదార్థాలెన్నో ఉంటాయి. ఇవి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. థైరాయిడ్ కూడా అదుపులో వుంటుంది. కొబ్బరిలో విటమిన్లు సి, ఇ, బి1, బి6, బి5, బీ3, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా వున్నాయి.
కొబ్బరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఔషధ గుణాలు గుండె, కాలేయం, మూత్రపిండాల రుగ్మతలను నయం చేస్తాయి. దాహం తీర్చుకోవడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. శరీరంలో కొబ్బరికాయల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి.
అరటి, యాపిల్స్ కంటే కొబ్బరిలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. కొబ్బరి నీరు జీర్ణక్రియకు చాలా మంచిది. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం వుంటుంది.