జ్ఞాపకశక్తి పెరగాలంటే ధనియాలతో వాటిని కలిపి తీసుకుంటే...

శుక్రవారం, 22 జనవరి 2021 (22:58 IST)
జ్ఞాపక శక్తి పెరగాలంటే ధనియాలు, సోంపు, యాలుకలు, సీమ బాదంపప్పులు, పటికబెల్లం చూర్ణాలను ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని, రోజూ పడుకునేటప్పుడు 100 మి.లీ గోరువెచ్చని పాలలో 2 నుంచి 3 గ్రాముల పొడిని కలిపి సేవిస్తుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ధారణ, స్మరణశక్తి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
 
సీమ బాదం పప్పులను 1 నుంచి 2 గంటలు వేడి నీటిలో నాననిచ్చి, పొట్టు తీసి పప్పును ఎండించి చూర్ణం చేసి వాడుకోవాలి.
 
తల తిరగడం
ఉదయం ఒక మట్టిపిడతలో 200 మిల్లీ లీటర్ల నీళ్లు ఒక టీ స్పూను చొప్పున ధనియాలు, ఉసిరక పెచ్చులు వేసి రాత్రి వరకూ నానించి వడగట్టి ఆ నీళ్లను తాగాలి. అలాగే రాత్రి కూడా ఇదేవిధంగా నానబెట్టి, ఉదయం పూట వడగట్టి సేవిస్తూ వుంటే ఆ సమస్య తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు