ఆవు పాలలో 20 ఎండు ద్రాక్షలు, 10 మిరియాలు మరిగించి తాగితే?

బుధవారం, 19 అక్టోబరు 2016 (15:21 IST)
ఎండు ద్రాక్షల్లోని ధాతువులు రక్తంలోని రక్తకణాలను పెంచుతుంది. ఎండు ద్రాక్షల్లోని క్యాల్షియం ఎముకలకు బలాన్ని, దంతాల పటిష్టతకు సహాయపడతాయి. పిల్లలకు పాలు మరిగించేటప్పుడు అందులో 2 ఎండుద్రాక్షలు వేసి వడగట్టి తాగిస్తే దేహపుష్ఠి చేకూరుతుంది. గొంతురాసి వుంటే రాత్రి నిద్రించేటప్పుడు 20 ఎండు ద్రాక్షలను తీసుకుని ఆవుపాలలో వేసి మరిగించి.. 10 మిరియాలు చేర్చి మరిగించి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.  
 
ఎండుద్రాక్షల్ని గోరువెచ్చని వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టి పరగడుపున తీసుకుంటే నెలసరి సమస్యలు దరిచేరవు. హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. నెలసరి సమయాల్లో ఏర్పడే నొప్పిని తగ్గించాలంటే 20 ద్రాక్షపండ్లను తీసుకుని ఒక పాత్రలో వేసి రెండు గ్లాసుల నీరు, సోపు గింజలు ఒక టీ స్పూన్ చేర్చి కషాయంలా తయారు చేసి తాగితే మూడు రోజులు రెండు పూటలా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి