అలాగే దంత సమస్యలను తొలగిస్తాయి. నోటిని శుభ్రంగా వుంచుతాయి. గొంతు, ముక్కు సంబంధిత రుగ్మతలను పటాపంచలు చేస్తాయి. అలాంటి జామ ఆకులను నోటిలో వేసి నమలం ద్వారా లేకుంటే జామ ఆకులతో టీ తయారు చేసి తీసుకోవడం ద్వారా దంత సమస్యలు వుండవు. నోటిపూత తొలగిపోతుంది. గొంతులో కిచ్ కిచ్ వుండదు.
ఇంకా చెప్పాలంటే.. ఒబిసిటీకి జామ ఆకుల టీ ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తొలగిస్తుంది. జామ ఆకులు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. హృద్రోగ సమస్యలను దరిచేరనివ్వవు. దగ్గు, జలుబును దూరం చేసే శక్తి జామ ఆకులకు వుంది. జామ ఆకులను రోజూ కషాయంలా తీసుకుంటే మహిళలు నెలసరి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఒక గుప్పెడు జామ ఆకులను తీసుకోవాలి.