మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.
ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.