పరగడుపున హెర్బల్ వాటర్‌ను తాగితే?

శనివారం, 22 జులై 2017 (14:42 IST)
పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్‌ను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చు. తులసీ, బిల్వం లేకుంటే గరిక ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకుని రాత్రి నిద్రించేందుకు ముందు ఒక లీటరు నీటిలో వేసి మూసి వుంటచాలి. మరుసటి రోజు ఆ నీటిని పరగడుపున తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
 
పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఉష్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. రక్తపోటు,డ మధుమేహాన్ని దూరం చేస్తాయి. లేత మామిడి ఆకులను ఎండబెట్టి పొడి చేసి.. వేడినీటిలో మరిగించి ఉదయం పరగడుపున తీసుకుంటే మధుమేహం నయం అవుతుంది. 
 
వేపపువ్వుల పొడిని వేడినీటిలో మరిగించి తీసుకుంటే అల్సర్, పేగు సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఐదారు తులసీ ఆకులతో శొంఠి, 2 లవంగాలు చేర్చి బాగా రుబ్బుకుని.. నుదుటిపై లేపనంలా వేస్తే.. తలనొప్పి మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి