తేనె... పూల నుంచి సేకరించిన మకరందంతో తేనెటీగల శరీరాల్లో ఉండే రసాయనాలు కలిసి, మకరందం రసాయన స్థితి మారుతుంది. ఇలా తయారైన తేనె సింపుల్‌గా సుగర్స్‌లా విడివడి, తేనె తుట్టె గదుల్లోకి చేరుతుంది. దీనివల్ల తేనె ఎల్లకాలం చెక్కు చెదరకుండా నిల్వవుంటుంది.
అయితే, ఇదే గుణం ఆహారంలో ఉపయోగించే మెత్తని (సాల్ట్) ఉప్పుకు ఉండదు. ఈ ఉప్పు తయారీలో భాగంగా కలిపే అయొడిన్ కారణంగా మొత్తని ఉప్పు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అనేక కంపెనీలు తయారు చేసి విక్రయించే అయొడైజ్‌డ్ సాల్ట్ ఐదేళ్లకు మించి నిల్వ ఉండదు.