తక్కిలి ఆకు రసం, బహిష్టు సమమయంలోని మూడు రోజులు రోజుకు ఒకటి బై రెండు స్పూన్ల చొప్పున వాడాలి. స్త్రీ తన జడకొప్పు నందు గుంటకలగర ఆకును పూలకు బదులుగా ధరించి, సంభోగ క్రీడల్లో పాల్గొనిన గర్భం కలుగును. ఆ మూలికను ధరించినట్లు ఎవరికీ చెప్పకూడదు.
బుతుస్నానమైన తదుపరి సంపెంగ చెక్క రసమును త్రాగిన గర్భం కలుగును. పిప్పళ్లు, శొంఠి, నాగకేసరములు, మిరియములు ఈ వస్తువులను సమభాగములు చూర్ణించి ఒకటి భై రెండు తులము చూర్ణమును, ఆవు నెయ్యితో కలిపి ప్రతి నిత్యము తినుచున్నచో వంథ్యా స్త్రీలకు సంతతి కలుగును. అఆగే సరస్వతీ ఆకు సమూల రసమును, ప్రతి నిత్యం ప్రాత కాలమందు త్రాగుచుండిన వంథ్యా స్త్రీ గర్భమును ధరించి పుత్రులు జన్మిస్తారు.
చేరు పుచ్చ తీగను సమూలముగదించి, రసం తీసి ప్రతిరోజు ఉదయం 2తులముల రసమును, 5తులముల ఆవుపాలతో కలుపుకుని త్రాగు చుండిన వృథ్యా స్త్రీలు గర్భము ధరించెదరు. అశ్వగంధి కషాయమును. నేతితో గానీ, పాలతో గానీ సేవిస్తే గర్భం వస్తుంది. అల్లము, పిప్పళ్ళు, మిరియాలు, కుంకుమపువ్వు చూర్ణము చేసి నేతితో సేవిస్తే స్త్రీలు గర్భం ధరిస్తారు. వక్కలు, నాగకేసరములు సమభాగములు చూర్ణించి పూటకు ఒకటి బై నాలుగవ వంతు తులం చొప్పున ఆవునేతితో కలిపి సేవించిన నిశ్చయంగా గర్భం నిలుస్తుంది.