చెవినొప్పికి ముల్లంగి నూనెను తీసుకుంటే?

శుక్రవారం, 13 జులై 2018 (10:16 IST)
ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయ. ముల్లంగి ఆకుల్లో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ముల్లంగిని జ్యూస్‌గా తీసుకుంటే లివర్‌లో కలిగే వ్యాధులను నివారించవచ్చును. ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకుని తీసుకుంటే వాపు, నొప్పులకు మంచి ఫలితం లభిస్తుంది.
 
పచ్చిముల్లంగిదుంపలు, ఆకుల రసాన్ని తీసుకుంటే ఆకలిని పెంచుటకు సహాయపడుతుంది. ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ కొద్దిగా అన్నంలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలలో ఋుతుస్రావదోషాలను నివారించవచ్చును. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కాస్త ముల్లంగి రసాన్ని త్రాగితే వెంటనే తగ్గిపోతాయి.
 
విపరీతమైన జలుబు, దగ్గుల, ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా ఇటువంటి బాధలనుండి విముక్తి చెందవచ్చును. మూత్రపిండాలో ఏర్పడిన రాళ్ళను కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తీసుకుంటే ఇలాంటి సమస్యలను నివారించుటకు ఉపయోగపడుతుంది.
 
ముల్లంగి రసాన్ని తీసుకుని దానిలో కాస్త నూనెను వేసి కాచుకున్న తరువాత వడగట్టాలి. చెవిపోటు, చెవిలో హోరు మెుదలైన బాధలున్నవారు చెవిలో కొంచెం ఈ నూనెను వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ళవాపులు, నొప్పులు కలిగిన చోట ఈ నూనెను మర్థనా చేస్తే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు