ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే..? మెమరీ పవర్..?

మంగళవారం, 23 జూన్ 2015 (18:42 IST)
ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే చర్మం నిగారింపును సంతరించుకోవడంతో పాటు.. నీరసం, పిత్తాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే అరటి పూవులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటితో చేసే వంటకాల ద్వారా ఉదర సమస్యలు, నెలసరి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. అరటి కాడ జ్యూస్ ద్వారా కిడ్నీ సమస్యలను తొలగించుకోవచ్చు. ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. అరటి కాడను ఎండబెట్టి  పొడిగా చేసుకుని తేనె కలిపి తీసుకుంటే పచ్చకామెర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.  
 
అరటి పిందెలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేసుకోవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. దగ్గును తగ్గించుకోవచ్చు. అప్పుడప్పుడు అరటి పండును తీసుకోవడం ద్వారా పేగు వ్యాధులను నయం చేసుకోవడంతో పాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మెమరీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి