వర్షాకాలం.. దివ్యౌషధంగా పనిచేసే తుమ్మి పువ్వులు.. జ్వరం పరార్ ఎలా? (video)

మంగళవారం, 22 అక్టోబరు 2019 (13:11 IST)
తుమ్మి పువ్వులు, అవీ తెల్ల తుమ్మి పువ్వుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరానికి తుమ్మి పువ్వు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
తుమ్మి పువ్వు వగరుగా వుంటుంది. ఇది జలుబును తగ్గిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను తొలగిస్తుంది. తుమ్మి ఆకుల రసాన్ని ఒక స్పూన్ తీసుకుంటే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది. తుమ్మి పువ్వులు దాహార్తిని దూరం చేస్తాయి. జ్వరం, కంటి వ్యాధులను తగ్గిస్తుంది. 
 
ఆరోగ్యానికే కాదు.. పూజకు కూడా తుమ్మి పువ్వు ఉపయోగపడుతుంది. 25 తెల్ల తుమ్మి పువ్వులను అర గ్లాసుడు మరిగిన పాలలో వేసి.. ఒక గంట పాటు నానబెట్టి.. పిల్లలకు అందిస్తే.. గొంతు సమస్యలుండవు. 10 చుక్కల తుమ్మి పువ్వుల రసాన్ని.. ఉదయం మాత్రం పిల్లలకు ఇస్తే, జలుబు, జ్వరం, వెక్కిళ్లు తొలగిపోతాయి.
 
ముఖ్యంగా రెండు తుమ్మి చెట్టు ఆకులు, పువ్వులతో పాటు రెండు గ్లాసుడు నీటిలో బాగా మరిగించి.. అది గ్లాసుడు అయ్యాక తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి కూడా మాయం అవుతుంది. తుమ్మి పువ్వు రసాన్ని 15 చుక్కలు, తేనె 15 చుక్కలు కలిపి ఉదయం పూట తీసుకుంటే నీరసం, దాహార్తి తగ్గిపోతాయి. 
 
ఇంకా చర్మ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. తుమ్మి ఆకులను పేస్టుగా చేసుకుని ఐదు రోజుల పాటు రాసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు