ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని అంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను 'శంశమినివటి' అనే పేరుతో మందులుగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు వివరిస్తున్నారు.
తిప్పతీగ ఆకుల్లోనే కాదు.. కాడల్లోనూ వైద్య గుణాలు ఉన్నాయట. కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ తిప్పతీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్ తీగలు సహా ఎక్కడైనా పాకుతూ పోతుంటుంది.