చైనా యువత భారత్ గురించి ఏమనుకుంటున్నారు?

గురువారం, 3 సెప్టెంబరు 2020 (15:49 IST)
చైనా విద్యార్థులు భారత్ గురించి ఏమనుకుంటున్నారు? చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ చైనా పౌరులతో చేసిన ఓ సర్వేని గతవారం ప్రచురించింది. చైనా యువత భారత్‌ను ఎలా చూస్తుందని బీబీసీ కొంతమంది విద్యార్థులను అడిగింది.

 
భారత్ ఒక టెక్నాలజీ హబ్ అని నా భావన. అక్కడ బాలీవుడ్ బాగా ఫేమస్. ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వివాదంతోపాటు కరోనా వైరస్ వల్ల పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. అందుకని మనం కూడా కలిసి ఉండాలి.

 
రెండు దేశాల మధ్య ఉన్న మనస్పర్థల్ని తగ్గించుకోవాలి. విద్యా సంబంధిత విషయాల ద్వారా రెండు దేశాల యువతను ఒకచోటుకి తీసుకురావాలి అని కొందరు చెప్పారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు