పక్షులు ఎందుకు అరుస్తాయి?

సోమవారం, 19 ఆగస్టు 2013 (18:02 IST)
File
FILE
ఒక్కో పక్షి ఒక్కో విధంగా అరుస్తుంది. ఒకే జాతి పక్షి సందర్భాన్ని బట్టి అరిచే తీరూ మారుతుంది. ఆహారం గురించి, శత్రువు గురించి చెప్పవలసి వచ్చినపుడు, బాధ కలిగినపుడు పక్షులు అరుస్తుంటాయి. ఇవి ఆయా సమయాల్లో అందుకు అనుగుణంగా అరుస్తుంటాయి. ముఖ్యంగా మగ పక్షుల అరుపులు విచిత్రంగా ఉంటాయి.

అదే ఆడ పక్షులు తమ ఆచూకీ తెలుసుకునేందుకు, మగ పక్షులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా అరుస్తాయి. అదేవిధంగా గుడ్లు పెట్టేందుకు అనువైన కాలంలో ఈ పక్షుల అరువులు భిన్నంగా.. పోటీపడి అరవడం కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి