ముఖం మీద మచ్చలు పోయి మెరిసేలా ఉండాలంటే...!

శనివారం, 22 జూన్ 2013 (18:23 IST)
File
FILE
పుదీనాతో : పుదీనా ఆకుల్ని మిక్సీలో మెత్తగా పేస్టు చేసి, రాత్రి పడుకోబోయే ముందు ముఖంపై మచ్చలున్నచోట రాసుకోవాలి. ఉదయం వేణ్నీళ్ళతో ముఖం కడిగేసుకోవాలి. అలానే పుదీనా ఆకుల్ని నీళ్లతో వేసి బాగా వేడి చేసి, చల్లారాక ఆ నీళ్లతో ముఖం కడుక్కున్నా మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మునుపటిలా మారుతుంది. అలాగే పుదీనా ఆకులూ, పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని అరగంట తరవాత కడిగేసుకున్నా మంచిదే.

దానిమ్మతో : దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడిచేయాలి. ఒక టీ స్పూను పొడిచేయాలి. ఒక టీ స్పూను పొడికి, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మచ్చలకి రాయాలి. ఆరాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మచ్చలు త్వరగా మానిపోతాయి. అలాగే మునక్కాడ ఆకులను పేస్టు చేసి, అందులో నిమ్మరసం కలుపుకుని రాసుకున్నా ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి