వేసవిలో పెరుగుతో చర్మ సౌందర్యం.. ఇవిగోండి టిప్స్!

శుక్రవారం, 16 మే 2014 (12:51 IST)
FILE
అసలే ఎండాకాలం. మీ చర్మం నల్లబారిపోతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది.

అలాగే శెనగపిండిని పెరుగులో కలిపి నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే ముఖంపైనున్న మృత కణాలు తొలగిపోతాయి. ఇంకా ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే మంచి క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.

అలాగే ఐదు టీ స్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి