బేకింగ్ సోడా వంటకే కాదు.. అందానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బ్యూటీషియన్స్ అంటున్నారు. బేకింగ్ సోడా ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చునని వారు అంటున్నారు. జుట్టు పెరుగుదల, తెలుపైన దంతాలు, నెయిల్స్ బ్యూటీ కోసం సూపర్‌గా పనిచేస్తుంది.
బేకింగ్ సోడా ఓ క్లీనింగ్ ఏజెంట్. జిడ్డు సమస్యల నుండి జుట్టును కాపాడుకోవాలంటే అర స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి జుట్టును శుభ్రం చేస్తే క్లోరిన్ కాంతి మీద పోరాటం చేస్తుంది. లేకపోతే నీటిని జుట్టు మీద జల్లుకొని, త్వరగా పొడి షాంపూతో బ్రష్ చేయండి. బేకింగ్ సోడా జుట్టు మీద నూనెలు, హెయిర్ స్ప్రేలు, కండిషనర్లు వంటి ఉత్పత్తులను శుభ్రపరుస్తుంది.