ఐస్ క్యూబ్స్‌తో అందానికి మెరుగులు

గురువారం, 8 జూన్ 2023 (22:05 IST)
ఐసు ముక్కలతో ముఖాన్ని రుద్దితే వృద్ధాప్య ఛాయలు దరిచేరవని చెపుతుంటారు. అంతేకాదు ఐసు ముక్కలతో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కను ముఖానికి రాసుకుని ఆ తర్వాత క్రీమును రాసుకుంటే అది చర్మం పైన బిగుతుగా అవుతుంది. దీనితో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. కంటి కింద ఐసు ముక్కతో మృదువుగా రాస్తే నల్లని వలయాలు తగ్గిపోతాయి.
 
ముఖం జిడ్డుగా వుంటే బయటి మలినాలు తేలికంగా చర్మంలోకి ఇంకి మొటిమలు, మచ్చలు వస్తాయి. ఇది రాకుండా వుండాలంటే ముఖానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి. నిద్రలేమితో బాధపడేవారు, ఎక్కువ పని గంటలు కంప్యూటర్ పైన పని చేసేవారు ఐస్ క్యూబులను కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 
పెదవులపై చర్మం పొడిబారినట్లు వుంటే వాటిపై ఐసు ముక్కతో మృదువుగా రాస్తే సమస్య తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా ఐస్ క్యూబ్‌లను చర్మంపై రుద్దడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, నిరోధించడానికి ఒక గొప్ప మార్గం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు