అమ్మాయిలూ బరువు తగ్గాలా.. అయితే ఇలా చేయండి...

మంగళవారం, 28 నవంబరు 2017 (10:59 IST)
చాలామంది అమ్మాయిలు ఊబకాయంతో పాటు అధిక బరువుతో బాధపడుతుంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల బరువు అదుపులో లేకుండా పోతుంది. చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటివారు ప్రతి రోజూ కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు పెరగకుండా నియింత్రించుకోవచ్చు. 
 
* ప్రతి రోజూ ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారమే తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా నియంత్రిస్తుంది. 
* శరీర బరువు తగ్గాలంటే ఆహారం వేళకు తీసుకోవడంతో పాటు తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.
* ఉదయాన్నే నిద్ర లేవడం, చిన్న చిన్న మొక్కలు నాటడం వంటి పనులు చేసినా కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి.
* ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఎరోబిక్ వ్యాయామాలు చేయడం ఎంతో మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు